Press "Enter" to skip to content

Noothanamainadi Nee Vatsalyamu Song Lyrics Now

Noothanamainadi Nee Vatsalyamu Song Lyrics Now

నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)

Advertisements

గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||

నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు
ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2)
మరువని దేవుడవు – నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||

Advertisements

నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

Views: 6

Advertisements

Be First to Comment

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.